EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు!

మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే ఇది మీకు కచ్చితంగా శుభవార్త. సాధారణంగా ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగులు తమ పీఎఫ్‌ను రెట్టింపు చేసుకునే అవకాశం ఉంది.
  • Jan 04, 2021, 16:56 PM IST

Double PF Deduction Of EPF Account Holder: మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే ఇది మీకు కచ్చితంగా శుభవార్త. సాధారణంగా ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగులు తమ పీఎఫ్‌ను రెట్టింపు చేసుకునే అవకాశం ఉంది.

1 /5

మీకు ఈపీఎఫ్ఓ(EPFO) పీఎఫ్ ఖాతా ఉందా? అయితే ఇది మీకు కచ్చితంగా శుభవార్త. సాధారణంగా ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగులు తమ పీఎఫ్‌ను రెట్టింపు చేసుకునే అవకాశం ఉంది. కంపెనీని రిక్వెస్ట్ చేస్తే మీ పీఎఫ్‌ను రెట్టింపు చేసుకోని ప్రయోజనాలు పొందండి. ట్యాక్స్ లాంటి విషయాలతో పాటు దీర్ఘకాలిక సేవింగ్స్ కింద పీఎఫ్ ఖాతాను వినియోగించుకోవచ్చు. Also Read: PF Balance Check: మీ ఖాతాల్లోకి వడ్డీ జమ.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

2 /5

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ అకౌంట్‌పై 8.5 శాతం వడ్డీ అందిస్తోంది. ప్రభుత్వ అందించే వాటిలో వడ్డీ రేటు లభిస్తున్న ఏకైక స్కీమ్ ఇదే. ఇటీవల వడ్డీ రేటును కాస్త సడలించారు. అయినా సరే పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెంచుకోవడం వల్ల పీఎఫ్ బ్యాలెన్స్(PF Balance) పెరగడంతో పాటు ఉద్యోగికి దీర్ఘకాలంలో లాభాలుంటాయి. 

3 /5

ప్రస్తుతం ఉద్యోగి బేసిక్ శాలరీ, డీఏలలో 12 శాతం ప్రతినెలా PF ఖాతాకు జమవుతుంది. ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ సైతం అదే మొత్తం నగదును పీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూట్ చేస్తుంది. ఒకవేళ ఉద్యోగి తమ పీఎఫ్‌ను రెట్టింపు చేసుకోవాలనుకుంటే కంపెనీ హెచ్‌ఆర్‌ను సంప్రదించాలి. పీఎఫ్ డబుల్ చేసుకోవాలన్న రిక్వెస్ట్‌ను ఆమోదం పొందేలా చూసుకోవాలి.  Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

4 /5

ఇక ప్రతినెలా ఉద్యోగి బేసిక్ శాలరీ, డీఏలలో 12 శాతం బదులుగా 24 శాతం నగదు పీఎఫ్ ఖాతాలో జమవుతుంది. అవసరమైతే ఉద్యోగి తన కంట్రిబ్యూషన్‌ను బేసిక్ శాలరీలో 100శాతం వరకు పెంచుకోవచ్చునని ఈపీఎఫ్ఓ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఏకే శుక్లా గతంలోనే వెల్లడించారు. అలా చేసేవారు సెక్షన్ 80సీ ప్రకారం ఆదాయపు పన్నులో ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చని సూచించారు.

5 /5

పీఎఫ్‌ను రెట్టింపు చేసుకోవడం దీర్ఘకాలిక సేవింగ్ స్కీమ్ కింద పనికొస్తుంది. రిటైర్మెంట్ సమయంలో అధికమొత్తంలో నగదు అందుతుంది. రెట్టింపు పీఎఫ్ కనుక దానికి వడ్డీ సైతం అంది ప్రయోజనం చేకూరుతుందని ఏకే శుక్లా వివరించారు. ఉద్యోగులలో చాలా మందికి ఈ విషయం తెలియక పన్ను మినహాయింపుల కోసం లేని పోని స్కీమ్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు.  Also Read : PF Balance Missed Call Number: పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవచ్చు.. ఒక్క మిస్డ్ కాల్ చాలు